సినీ మాయే జీవితం? part1
కోనసీమలో అమలాపురం దగ్గర ఒక పెద్ద గ్రామం. సినిమా షూటింగ్ జరుగుతోంది. నిర్మాత, దర్శకుడు నాకు మంచి స్నేహితులు. డైరెక్టరు నాకు ఫోన్ చేశాడు. మేమిక్కడ పది రోజులు క్యాంపు, నువ్వొచ్చి రెండు రోజులు మాతో వుండవా అని అడిగాడు. రెండు రోజులేనా అన్నాను. స్వామీ మేమున్నన్ని రోజులూ నువ్వుంటానంటే అంతకంటే మహా భాగ్యమా అన్నాడు. సరే ఒకట్రెండు రోజులైతే చూద్దాంలే అన్నాను. మేము పదో తేదీన దిగుతున్నాము. నువ్వు పదకొండున గాని పన్నెండున గాని రావడానికి ప్లాన్ చేసుకో అన్నాడు. సరే అన్నాను.
నాకు ప్రస్తుతం సినిమాలు చూసే ఆసక్తి తగ్గి పోయింది. గతంలో తెగ చూసేవాణ్ని. ఇప్పుడు హాలు కెళ్ళి చూసే ఓపిక, ఇంట్రస్టు లేవు. ఇంట్లో టి.వి. పెడితే ఏ టైములో నైనా సినిమాలే సినిమాలు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లిషు- ఈభాషల్లో సినిమాలు చూస్తా. ఒక్కోభాషలో ఒకే సమయంలో అనేక సినిమాలు. ఒకటి చూస్తూ వుంటే ఇంకో ఛానల్లో ఇంకా మంచిదేమన్నా ఉందేమోనని ఛానళ్ళు మార్చడం, ఏదీ సరిగ్గా చూడకపోవడం మామూలై పోయింది. మంచి సినిమా వచ్చినా పూర్తిగా చూడలేకపోతున్నాను. సినిమా తీస్తుండగా చూడాలని మాత్రం అనిపిస్తున్నదీమధ్య. విద్యార్ధి జీవితంలో ‘దగ్గర్లో షూటింగ్ జరుగుతుందట రారా చూసొద్దాం’ అని స్నేహితులు పిలిచే వాళ్ళు. నాకు బోర్, నేను రాననే వాణ్ణి. షూటింగ్ చూడ్డం ఏంటి సినిమా చూడాలిగాని అనుకునే వాణ్ని. అంటే ప్రోడక్టు మీద ఉన్న ఇంట్రస్టు ప్రోసెస్ మీద వుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ప్రోడక్టు మీద ఇంట్రస్టు తగ్గి ప్రోసెస్ మీద ఇంట్రస్టు పెరగడం. ‘ఎంతో మంది కలిసి పని చేస్తే కాని సినిమా తయారవ్వదు. అందులో ఎంతో కష్టం వుంటుంది. నైపుణ్యం కూడా వుంటుంది. కొంత మందికి పేరొస్తుంది. ఎంతో మంది అనామకులుగా మిగిలిపోతారు.’ - ఇదీ నా అవగాహన. ఐతే దగ్గరుండి చూస్తే వచ్చే అనుభూతిని కోరుకుంటున్నాను. ప్రోసెస్ అంతా చూసే ఓపిక నాకు లేదు. శాంపుల్ స్టడీ చాలు అని నా ఆలోచన. నేనీ పరిస్థితిలో వుండగా పేషెంటు కోరుకున్న మందే డాక్టర్ ఇచ్చినట్లు నా ఫ్రెండు నన్ను పిలిచాడు.
(to be cont.)